Site icon NTV Telugu

Purandeswari: సీఎం జగన్ రైతులకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా మోసం చేశారు..

Purandeshwari

Purandeshwari

శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటనపై ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరీ స్పందించారు. ర్తెతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా మోసం చేసిన సీఎం జగన్ బటన్ నొక్కడం కూడా మోసగించడమేనంటూ ఆమె మండిపడ్డారు. నా మీద చేసే విమర్శలు డ్తెవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు.. అవినీతి పేట్రేగిపోతోంది అంటూ పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Katrina Kaif Morphed Photo: తారుమారు అయిన కత్రినా కైఫ్ టవల్

విజయసాయి రెడ్డి ప్రతి ట్వీట్ ప్తె సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఆయనంత తెలివి నాకు లేదు.. ఏపీ మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిధ్రం అయ్యాయి.. ఈ కుటుంబాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వ్తెసీపీప్తె ఉంది.. జనం ప్రాణాలు పోతున్న జేబులు నిండాలన్న ఆలోచన వారిలో ఉంది అని ఆమె తెలిపారు. విపక్ష పార్టీలకు మేము చేసిన అభివృద్ధి చూపించడం కోసమే సెంట్రల్ యూనివర్సిటీ పనుల పరిశీలన చేశామన్నారు.

Read Also: Sara Ali Khan Dating: శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్.. హింట్ ఇచ్చేసిన సారా అలీ ఖాన్‌!

491 ఎకరాల్లో యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని పురంధేశ్వరి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు ఆలస్యం వల్ల నిర్మాణ పనులు ఆలస్యం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీకి 711 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి.. మొదటి విడతగా 299కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో సదుపాయాలు ఉండేలాగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పనులన్నీ జరుగుతాయి.. కేంద్ర ప్రభుత్వ సహకారం తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరిగిందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

Exit mobile version