NTV Telugu Site icon

Purandeswari: అమరావతి రాజధాని అన్న విషయానికి బీజేపీ కట్టుబడి ఉంది..

Purandeswari

Purandeswari

గుంటూరులో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొని, ప్రసంగించారు. కార్యకర్తల శ్రమతోనే బీజేపీ పార్టీ ఎదిగిందని తెలిపారు. రాష్ట్రానికి 22 లక్షల ఇళ్ళు కేంద్రం మంజూరు చేసిందని అన్నారు. కాగా.. బీజేపీ పార్టీ భాగస్వామ్యంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కాగా.. రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. రాజధాని విషయంలో టీడీపీ డిజైన్లతో కాలక్షేపం చేస్తే వైసీపీ మూడుముక్కల ఆట ఆడుతోందని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చింది భారతీయ జనతాపార్టీ.. అమరావతి రాజధాని అన్న విషయానికి బీజేపీ కట్టుబడి ఉందని పురంధేశ్వరి తెలిపారు.

Union Budget: పెన్షనర్లు, ఉద్యోగులకు బడ్జెట్‌లో తీపికబురు…!

ఆమే మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించింది బీజేపీ.. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీ అని అన్నారు. పోలవరం నిర్మాణ కాంట్రాక్టు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి ఎందుకు ఇచ్చారో అర్ధం కాలేదు.. ట్రాన్స్ ట్రాయ్ కి ఆ అర్హత లేదని పురంధేశ్వరి పేర్కొన్నారు. అక్రమ మార్గంలోని ఆనాటి ప్రభుత్వం ట్రాన్స్ ట్రాయ్ కి కాంట్రాక్టులు కట్టబెట్టిందని దుయ్యబట్టారు. నాయకులకు అవసరమైన ప్రతిసారి ప్రత్యేక హోదా గుర్తొస్తుంది.. ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు తర్వాత మాట మార్చారని మండిపడ్డారు. ఆనాటి ప్రభుత్వం నుంచి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం వరకు స్పెషల్ ప్యాకేజీ తీసుకోకుండా ఏపీ ప్రజలను మోసం చేశారని తెలిపారు.

Chhattisgarh: మావోయిస్టుల కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి, 14 మందికి గాయాలు

దేశానికి సుపరిపాలన అందించిన నాయకుడు మోడీ అని పురంధేశ్వరి అన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. 2014 తర్వాత అప్పుడే పుట్టిన ఏపీ అనే పసిగుడ్డును సంరక్షించే బాధ్యత బీజేపీ తీసుకుందన్నారు. ఏపీలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాత్రమే జరుగుతుందని చెప్పారు. అయినా బీజేపీపై అపవాదులు వేస్తున్నారు.. మీరు చేసే ఏ అభివృద్ధిలో అయినా సరే, బీజేపీ సహకారం లేదని చెప్పగలరా అని సవాల్ చేశారు. తల లేని మొండెంగా.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుంది.. 20వేల కోట్ల రూపాయలతో అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. అమరావతి రాజధానిగా బీజేపీ విశ్వసించిందని పురంధేశ్వరి పేర్కొన్నారు.