NTV Telugu Site icon

Purandeswari: మోసపూరిత వాగ్దానాలతో రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది..

Purandeshwari

Purandeshwari

కూకట్‌పల్లిలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు ఓటు వేస్తే.. అతడి ద్వారా నియోజక వర్గంలో అభివృద్ది పనులకు సపోర్టు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది అవసరమని ప్రజలు భావిస్తున్నారు.. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారిపోయాయన్నారు. బీజేపీ, జనసేన పార్టీ ప్రజల సమస్యలపై గళం విప్పి పోరాడే పార్టీలు.. ఈ పార్టీల అభ్యర్థులను ఆదరిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి.. నియోజక వర్గంలో ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనా పురందేశ్వరి అన్నారు.

Read Also: Mansoor Ali Khan: త్రిష పెళ్లి కూతురు.. నేను పెళ్లి కొడుకు.. సారీ ఎందుకు చెప్పాలి..

మోసపూరిత వాగ్దానాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి కోరారు. ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మాట తప్పారు.. ఒక్కసారి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి, అదే కార్యాలయం ద్వారా పేపర్ లీక్ అవ్వటంతో అభ్యర్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.. అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం ఉంది అని ఆమె ప్రశ్నించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని గొప్ప వాగ్దానాలు చేశారు.. కానీ ఆ హామీ నెరవేర్చలేదని.. జీహెచ్ఎంసీలో 9 లక్షల అప్లికేషన్స్ ఉండగా కేవలం 50 వేల ఇండ్లు మాత్రమే నిర్మించారు అని పురందేశ్వరి ఆరోపించారు.

Read Also: Viral Video: నాగుపాము తలమీద ముద్దు పెట్టిన ఓ వ్యక్తి.. తర్వాత ఏమైందంటే..?

పేదవాడి సొంతింటి కళ కలగానే మిగిలిపోయింది అని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మాట తప్పారు.. దళితులకు భూమి ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదు.. దళిత బంధు స్కీంలో అవినీతి జరుగుతుంది.. ఆ అవినీతినీ కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు.. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉపాధ్యాయులకు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. వాటిని భర్తీ చేయటం లేదు.. ఏ హామీ నెరవేర్చారనేది చెప్పి కేసీఆర్ ఓటు అడగాల అని ఆమె ప్రశ్నించారు. దేశంలో 4 కోట్ల ఇండ్లను మంజూరు చేశారు.. వాటిలో 3 కోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసాము.. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణంలో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయి.. అనేక అభివృద్ది కార్యక్రమాలలో కేంద్రం యొక్క సహాభాగం ఉన్నది.. సబ్ కే సాత్ సబ్ కా వికాస్ అంటూ అందరి అభివృద్ధిని కాంక్షితున్నది బీజేపీ పార్టీ అని పురందేశ్వరి వెల్లడించారు.

Show comments