Aman Dhaliwal : అమెరికాలో పంజాబీ నటుడు అమన్ ధాలివాల్ పై దాడి జరిగింది. ఓ జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా, అతడిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. దుండగుడు కత్తిని చూపి ఇతర జిమ్ సభ్యులను బెదిరించాడు. ఓ వైపు గాయాలతో రక్తమొడుతున్నా నటుడు సదరు వ్యక్తి దాడి చేయకుండా చేతిని పట్టుకున్నాడు. ఆ తర్వాత అదును కోసం చూస్తూ ఒక్కసారిగా నిందితుడిపై దాడి చేశాడు. ఆ తర్వాత దాడికి పాల్పడిన వ్యక్తిని మరికొందరు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఆ తర్వాత అమన్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. మెడతో పాటు చేతులకు కత్తి గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా.. అమన్ స్వస్థలం పంజాబ్‌లోని మాన్సా… హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘జోధా అక్బర్’తో పాటు పలు పంజాబీ సినిమాల్లోనూ నటించాడు. ప్రస్తుతానికి, అమన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.
Read Also: Nani: సక్సెస్ వస్తే నా పేరు చెప్పి.. ఫెయిల్యూర్ అయితే డైరెక్టర్ పేరు చెప్పను
కాలిఫోర్నియాలోని గ్రాండ్ ఓక్స్‌లోని ఉత్తర అమెరికాకు చెందిన ప్లానెట్ ఫిట్‌నెస్ – జిమ్‌ల వద్ద అమన్‌పై దాడి జరిగింది. ఈ సంఘటన ఉదయం 9:20 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమన్ పంజాబీ సినిమాల్లో నటించడమే కాకుండా జోధా అక్బర్, బిగ్ బ్రదర్ వంటి బాలీవుడ్ చిత్రాలలో నటించారు. నటుడు ఇష్క్ కా రంగ్ సఫేద్, పోరస్ మరియు విఘ్నహర్త గణేష్ వంటి టీవీ షోలలో కూడా భాగమయ్యాడు. తెలియని వారికి, అమన్ ధాలివాల్ మిథు సింగ్ కహ్నేకే, గుర్తేజ్ కౌర్ ధాలివాల్ కుమారుడు. అమన్ ధాలివాల్ ఢిల్లీలోని మెడికల్ కాలేజీ నుండి రేడియాలజీలో బ్యాచిలర్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.
Read Also: Maharastra: మహారాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే
Punjabi singer Aman Dhaliwal attacked in US
*Singer sustained sharp edged weapon in juries
*Motive behind attack was yet to be known #punjabisinger pic.twitter.com/NcZQyuWsfV— Aishwarya Kapoor (@aishkapoor) March 16, 2023