చాలా మంది అదృష్టం కలిసొస్తేనే తప్ప జీవితం బాగుపడదని అంటుంటారు. ఏదో సరదాగా ఇలాగున మాట్లాడుతుంటారు. కానీ ఆ వ్యక్తి విషయంలో మాత్రం అక్షరాల నిజమైంది. రాత్రికి రాత్రే ఓ మెకానిక్ కోటేశ్వరుడైపోయాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.
మహిందర్ సింగ్.. మోగా జిల్లాలోని నిహాల్ సింగ్ వాలా గ్రామం. చిన్న దుకాణంలో పాత స్టవ్‌లను రిపీర్ చేస్తుంటాడు. కళ్లద్దాల రిపేర్ కోసం గురుగ్రామ్ వెళ్లి తిరిగి వస్తుండగా ఓ లాటరీ షాపులో టికెట్ కొనుగోలు చేశాడు. నాగాలాండ్ రాష్ట్ర డియర్ మహా శివరాత్రి బంపర్ 2026లో టికెట్ కొన్నాడు. ఫిబ్రవరి 21న నిర్వాహకులు లక్కీడ్రా తీశారు. దీంతో మహిందర్ సింగ్ కొనుగోలు చేసిన టికెట్ ఫస్ట్ ఫ్రైజ్ రూ.3 కోట్లు గెలుచుకుంది. దీంతో రాత్రికి రాత్రే స్టవ్ మెకానిక్ కోటేశ్వరుడైపోయాడు. దీంతో స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందిస్తున్నారు. ఏజెంట్ కమిషను, ఇతర మినహాయింపులు పోగా రూ.1.80 కోట్లకు పైగా మహేంద్రసింగ్ చేతికి అందనుంది.