PBKS vs LSG: బౌలర్లను ఉతికారేసిన ప్రియాంశ్ ఆర్య, కనోలీ.. లక్నో ముందు భారీ టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా 29వ మ్యాచ్ ఈరోజు, ఆదివారం, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతోంది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన పంజాబ్ బ్యాటింగ్ లో చెలరేగిపోయింది. లక్నో బౌలర్లను ఉతికారేస్తూ పరుగుల వరద పారించారు పంజాబ్ ప్లేయర్స్. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 07 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. లక్నోకు 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
Also Read:New Pensions: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి కూడా పెన్షన్లు..
Also Read
- AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్‌నినోపై చర్చ!
- TVK Vijay Government: విజయ్ ప్రభుత్వానికి 100 రోజులు.. “డమ్మీ సీఎం” అంటూ విమర్శలు..!
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు ప్రారంభం.. తొలి కమర్షియల్ ఫ్లైట్‌గా ఇండిగో!
- The Hundred Women's Champions: కావ్య మారన్‌కు నిరాశ.. ఫైనల్లో సన్‌రైజర్స్‌పై ట్రెంట్ రాకెట్స్ విజయం.!
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు మంచి ఆరంభం లభించలేదు. షమీ మొదటి ఓవర్లోనే ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఔట్ చేశాడు. అయితే, ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానోలీలు విజృంభించారు. చండీగఢ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించి బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ప్రిన్స్ యాదవ్ కానోలీని ఔట్ చేసి ఈ ప్రమాదకరమైన భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అయినప్పటికీ, వీరిద్దరూ 80 బంతుల్లో 182 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. కానోలీ 46 బంతుల్లో ఏడు సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. ప్రియాన్ష్ ఆర్య ఆ తర్వాతి ఓవర్లోనే ఔటయ్యాడు. ప్రియాన్ష్ 37 బంతుల్లో 93 పరుగులు చేశాడు.
తన ఇన్నింగ్స్‌లో ప్రియాన్ష్ 4 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు. అనంతరం, 16వ ఓవర్ రెండో బంతికి షమీ క్యాచ్ పట్టడంతో శ్రేయస్ అయ్యర్ అవుటయ్యాడు. అయ్యర్ 6 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి చేశాడు. 17వ ఓవర్లో మణిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్‌లో పూరన్ క్యాచ్ పట్టడంతో నెహల్ వధేరా ఔటయ్యాడు. 20వ ఓవర్లో శశాంక్ సింగ్ అవుటయ్యాడు. 6 బంతుల్లో 17 పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్, 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.
ప్రస్తుత సీజన్లో ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక స్కోరు. దీనికి ముందు, ఆర్సిబి చెన్నైపై 250 పరుగులు చేసింది. ఇది కాకుండా, లీగ్‌లో పంజాబ్‌కు ఇది రెండవ అత్యధిక స్కోరు. దీనికి ముందు, 2024లో కోల్‌కతాపై పంజాబ్ 262 పరుగులు చేసింది. పంజాబ్‌కు చెందిన ఇద్దరు బ్యాట్స్మెన్లు సెంచరీని అందుకోలేకపోయారు. ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులు చేయగా, కూపర్ కానలీ 46 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. షమీ, మొహ్సిన్ ఖాన్ చెరో 1 వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్‌నినోపై చర్చ!
-
Bihar Temple Stampede: బిహార్ ఆలయంలో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు భక్తులు మృతి
-
Jasmin Bhasin: స్టంట్ చేస్తూ జ్ఞాపకశక్తి కోల్పోయిన నటి.. బిత్తరపోయిన షో నిర్వాహకులు!
-
TVK Vijay Government: విజయ్ ప్రభుత్వానికి 100 రోజులు.. “డమ్మీ సీఎం” అంటూ విమర్శలు..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు ప్రారంభం.. తొలి కమర్షియల్ ఫ్లైట్‌గా ఇండిగో!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?