Site icon NTV Telugu

BKS vs MI : విజృంభించిన పంజాబ్‌ బ్యాటర్లు.. ముంబయి లక్ష్యం 215 పరుగులు

Pbks

Pbks

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే.. ఐపీఎల్-2023 సీజన్‌లో జరుగుతున్న 31వ మ్యాచ్ ఇది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంటే, పంజాబ్ జట్టు ఏడో స్థానంలో ఉంది. ఇరు జట్లకూ ఆరేసి పాయింట్లు ఉన్నాయి. రన్ రేట్ ముంబైకి ఎక్కువగా ఉంది. అయితే.. టాస్ గెలిచిన రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు.

Also Read : Shivathmika : గ్లామర్‌ డోస్‌ పెంచిన శివాత్మిక

అయితే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో సామ్ క‌ర‌న్‌ 29 బంతుల్లో 55 పరుగులు 5 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగాడు. హర్‌ ప్రీత్ సింగ్ భాటియా 28 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్సర్లు బాది 41 పరుగులు చేశాడు. అయితే.. ఆఖ‌ర్లో జితేశ్ శ‌ర్మ 7 బంతుల్లో 25 దంచికొట్ట‌డంతో ముంబై ముందు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది పంజాబ్‌.ముంబై బౌల‌ర్ల‌లో కామెరూన్ గ్రీన్, పీయూష్ చావ్లా చెరో రెండు వికెట్లు తీయ‌గా,అర్జున్ టెండూల్క‌ర్‌, జోఫ్రా ఆర్చర్,జాసన్ బెహ్రెండోర్ఫ్ త‌లా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Also Read : Kishan Reddy: ప్రజాజీవనాన్ని సౌలభ్యంగా మార్చడమే మోదీ సర్కారు లక్ష్యం

Exit mobile version