Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో టికెట్ నిరాకరించిన కారణంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా, సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామజ్రా ఆప్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు.హర్మీత్ సింగ్ తన రాజీనామా లేఖను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపారు. చేతన్ సింగ్ సోషల్ మీడియా పోస్టు ద్వారా పార్టీ వీడుతున్నట్లు వెల్లడించారు. తన నిర్ణయాన్ని వెంటనే ఆమోదించాలని పంజాబ్ ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరాను కోరారు.
పార్టీ నాయకత్వంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ రాజీనామాలు చోటుచేసుకున్నాయి. గతంలో తన సొంత ప్రభుత్వమే తనపై చర్యలు ప్రారంభించడంతో హర్మీత్ సింగ్ పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి పార్టీతో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తున్నారు.

