TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stone Attack on YSRCP Leaders in Punganur: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బసవరాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థుల తరఫున నామినేషన్లు దాఖలు చేసేందుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు అక్కడికి వెళ్లిన సమయంలో టీడీపీ శ్రేణులు దాడి చేశాయి.
నామినేషన్ కేంద్రానికి వెళుతున్న మిథున్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వాహనాలు ధ్వంసమైనట్లు వైసీపీ పార్టీ నేతలు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి, వైసీపీ నేతలు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లిన అనంతరం అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. టీడీపీ శ్రేణులు బారికేడ్లను తోసుకుని నామినేషన్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఘటనాస్థలిలో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Also Read
- Punam Raut Retires: "చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా".. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
- Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
పుంగనూరులో చోటుచేసుకున్న పరిణామాలపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ నేతలు ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఎన్నికల నిర్వహణలో భద్రతపై వైసీపీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో పారా మిలిటరీ బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్లను ఆన్లైన్లో కూడా స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నాయి. తాజాగా పుంగనూరులో జరిగిన ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైతే మరోసారి హైకోర్టును ఆశ్రయించే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఎన్నికల సంఘం, పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు జిల్లాలో రాజకీయ వేడిని పెంచాయి.
తాజావార్తలు
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!