NTV Telugu Site icon

Pune horror: భర్త అమానుషం.. భార్య శీలాన్ని శంకించి ఏం చేశాడంటే..!

Wife

Wife

రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. కట్టుకున్న భార్య పట్ల ఓ భర్త కర్కశంగా ప్రవర్తించాడు. కలకాలం తోడుగా.. అండగా ఉండాల్సిన అర్ధాంగి పట్ల దుశ్చర్యకు పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఏకంగా శీలానికి తాళం వేశాడు దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.

ఇది కూడా చదవండి: Payal Rajput: ప్రభాస్‌ చాన్స్ ఇస్తే నా కోరిక తీర్చుకుంటా.. హీరోయిన్ హాట్ కామెంట్స్..

నేపాల్‌కు చెందిన ఉపేంద్ర హుడాకే (30) తన భార్యతో కలిసి పూణెలో నివాసం ఉంటున్నాడు. పింప్రి-చించ్‌వాడ్‌లోని వాకాడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. హుడాకే సోదరి, మరికొందరు కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. రోజూ తాగొచ్చి అనుమానంతో భార్యతో గొడవ పడుతున్నాడు. అంతటితో ఆగకుండా మృగంగా మారి.. భార్య జననాంగాలను ఇనుప మేకులతో ఛిద్రం చేసి తాళం వేశాడు. ఈ దారుణ ఘటన మే 11న జరిగింది. బాధితురాలి ఆక్రందనలు విన్న సహచర నేపాలీయులు ఆమె పరిస్థితిని చూసి ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఆమె ఇప్పటివరకు చికిత్స పొందుతూ వచ్చింది. మే 16న (గురువారం) డిశ్చార్జ్ కావడంతో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు శనివారం పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుందని, ఆరోగ్యం మెరుగుపడిందని పోలీసులు వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు నేపాల్‌కు చెందిన ఉపేంద్ర హుడాకే (30)ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య

దంపతులిద్దరూ నేపాల్‌కు చెందిన వారని.. పనుల నిమిత్తం పూణె వచ్చి నివాసం ఉంటున్నారని దర్యాప్తు అధికారి బాలాజీ మేటే తెలిపారు. నేపాల్‌లోని ఒక గ్రామానికి చెందినవారని వెల్లడించారు. ఉపాధి కోసం మే నెల ప్రారంభంలో పూణెకు వచ్చారన్నారు. హుడాకే సోదరి కూడా వీరితోనే ఉంటుందని తెలిపారు. మద్యం మత్తులో హుడాకే ఈ దారుణానికి తెగబడ్డాడని పోలీసులు చెప్పారు. ఆమెను విపరీతంగా కొట్టి.. భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమె శీలానికి స్క్రూలు, ఇత్తడి తాళాన్ని వేసినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలో ఉన్న నేపాలీయులు ఆమెను రక్షించి ఆస్పత్రిలో చేర్చింపినట్లుగా పేర్కొన్నారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగిందని.. శస్త్రచికిత్స తర్వాత ఆమె కోలుకుందని బాలాజీ మేటే చెప్పుకొచ్చారు. ఆమె పరిస్థితి మెరుగుపడిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Tarun: రీఎంట్రీకి సిద్దమైన తరుణ్.. తల్లి రోజా రమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..