Noida: రెస్టారెంట్లో సర్వీస్ చార్జ్ రూ.970.. తుక్కు తుక్కుగా కొట్టుకున్న కస్టమర్లు, సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noida: మనం ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళితే అక్కడ సర్వీస్ చార్జ్ వేస్తుంటారు. మామూలుగా సర్వీస్ చార్జ్ మా అంటే 100లోపే ఉంటుంది. కానీ ఓ రెస్టారెంట్లో ఏకంగా రూ.970 సర్వీస్ ఛార్జీ విధించారు. దీనిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ చార్జ్ తొలగించమని అడినందుకు వాగ్వాదం చెలరేగి కస్టమర్లు, సిబ్బంది పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది.
ఆదివారం సాయంత్రం సెక్టార్ 75లో ఉన్న స్పెక్ట్రమ్ మాల్లోని డ్యూటీ ఫ్రీ రెస్టారెంట్‌కు సుమారు డజను మంది ఉన్న కుటుంబం వెళ్లింది. భోజనం చేసిన తర్వాత బిల్లు చూసి కంగుతిన్నారు. బిల్లులో రూ.970 సర్వీస్ ఛార్జ్ విధించారు. ఆ కుటుంబ సభ్యులు ఆభ్యంతరం వ్యక్తం చేశారు. సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా విధించిన సర్వీస్ ఛార్జ్‌ను బిల్లు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read
Read Also:Guntur Kaaram : సినిమాకే హైలైట్ గా నిలవనున్న ఆ సీన్…?
Kalesh b/w Bouncers and Family over service charge at spectrum mall sector 50pic.twitter.com/do9lk72bLx
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 18, 2023
రెస్టారెంట్ యాజమాన్యం సరేమీరా నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం కాస్త ఫైటింగ్ కు దారితీసింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు, రెస్టారెంట్ సిబ్బంది తిట్టుకోవడంతోపాటు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆ రెస్టారెంట్‌కు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని అదుపు చేశారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు.
Fight erupted between customers and staff in Noida’s Spectrum mall after restaurant levied ₹970 service charges
— Rishi Bagree (@rishibagree) June 19, 2023
Read Also:Bhatti Vikramarka : కృష్ణా జలాలు రాకుండా అడ్డుపడింది బీఆర్ఎస్ పార్టీనే
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!