NTV Telugu Site icon

YSRCP: వైసీపీలోకి పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి

Sateesh Reddy

Sateesh Reddy

YSRCP: పులివెందుల టీడీపీ నేత వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. 27 ఏళ్లు టీడీపీకి పని చేశానని.. కష్టపడి పులివెందులలో టీడీపీని నిర్మించానని.. తన కష్టానికి ఫలితం ఇవ్వకుండా అవమానపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానంతో 2020లోనే టీడీపీని వదిలి బయటకి వచ్చానన్నారు. 27 ఏళ్లు వైఎస్ కుటుంబంతో పోరాటం చేశానని.. ఇబ్బందులు పెట్టానని.. అయినా జగన్ పెద్ద మనసుతో నన్ను పార్టీలోకి ఆహ్వానించారన్నారు. నాలుగేళ్లు టీడీపి పట్టించుకోలేదని.. ఇప్పుడు రాయబారం పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Chegondi Suryaprakash: జనసేనకు షాక్‌.. సీఎం సమక్షంలో వైసీపీలోకి హరిరామజోగయ్య కుమారుడు

చంద్రబాబు పెద్ద అవకాశ వాది అని, చంద్రబాబు నాయకత్వం పార్టీలో తగ్గిపోతుంది.. వ్యాపార సంస్థలా లోకేష్ నడుపుతున్నాడని విమర్శించారు. తన లాంటి చాలా మంది సీనియర్లు ఇబ్బంది పడుతున్నారని సతీష్ రెడ్డి తెలిపారు. ఇకపై జగన్‌తో తన ప్రయాణం ఉంటుందన్నారు. తన అవసరం జగన్‌కు ఒక్క శాతం కూడా లేదని.. ఆయన ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తానన్నారు. తనకు ఎలాంటి డిమాండ్స్ లేవన్నారు.