Site icon NTV Telugu

Psych Siddhartha: ఓటీటీలోకి వచ్చేసిన ‘సైక్ సిద్ధార్థ’.. కానీ ?

Psych Siddhartha, Ott

Psych Siddhartha, Ott

శ్రీ నందు హీరోగా, వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్నమైన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. యామిని భాస్కర్ హీరోయిన్‌గా నటించిన ఈ వెరైటీ డ్రామా, ఈ ఏడాది టాలీవుడ్‌లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీగా నిలిచింది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమాను వీక్షించే విషయంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది.

Also Read : Shruti Haasan : అరుదైన జబ్బుతో పోరాడిన చిన్నారి ప్రాణాలు కాపాడిన శృతి హాసన్

‘ఆహా గోల్డ్’ సబ్‌స్క్రైబర్లు ఈ సినిమాను ఈరోజే (ఫిబ్రవరి 3) చూసే అవకాశం ఉంది. మిగిలిన సాధారణ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఈ చిత్రం రేపటి (ఫిబ్రవరి 4) నుండి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమా అటు కంటెంట్ పరంగా, ఇటు వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే సాధారణంగా థియేటర్లలో మిస్ అయిన విభిన్నమైన కథాంశం ఉన్న చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుంటుంది. మరి ఈ డిజిటల్ ప్రేక్షకులు ‘సైక్ సిద్ధార్థ’ను ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి.

Exit mobile version