Rice : బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice : మనది వ్యవసాయ ఆధారిత దేశం. మన నిత్యావసర వస్తువులలో ప్రధానమైనది బియ్యం. అన్నం తినకుండే మనకు రోజు గడవదు. మనం ఎంత కష్ట పడిన జానెడు పొట్టకోసమే. చాలామంది బియ్యాన్ని రెండు, మూడు నెలకు సరిపడేలా లేదా ఆరు నెలలకు సరిపడా కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటుంటారు. ఇలా నిల్వ చేసుకోవడం మంచిదే. కానీ ఇలా నిల్వ చేసుకోవడం వల్ల బియ్యంలో పురుగులు పడతాయి. ఈ పురుగులు విసర్జంచే వ్యర్థాలు, మలినాలు బియ్యానికి పడతాయి. ఇలాంటి బియ్యాన్ని వండుకుని తింటే లేనిపోని రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక మనం బియ్యంలో పురుగులు పడకుండా నిల్వ చేసుకోవాలి.
మార్కెట్ లో బియ్యానికి పురుగు పట్టకుండా చేసే పౌడర్ లు దొరుకుతుంటాయి. ఈ పౌడర్ ను బియ్యంలో కలపడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. కానీ ఇలా రసాయనాలు కలిగిన పౌడర్ ను వాడడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిలోనే చిన్న చిట్కాలను ఉపయోగించి మనం బియ్యం పురుగు పట్టకుండా చేయవచ్చు. పురుగు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేయడం చాలా కష్టం. బియ్యం నుండి ఒక్కో పురుగును తీయడం చాలా కష్టం. వీటిని శుభ్రం చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. బియ్యం పురుగు పట్టాక శుభ్రం చేయడం కంటే పురుగు పట్టకుండా ముందుగానే జాగ్రత్త పడడం మంచిది.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
Read Also:Telangana: ఏం కొడుకులు రా నాయనా..? తల్లిని గెంటేసి ఇంటికి తాళం..
బియ్యం పురుగుపట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో తేమ కూడా ఒకటి. బియ్యం నిల్వ చేసిన ప్రదేశం చుట్టూ లేదా ఆ ప్రదేశంలో తేమ ఉండడం వల్ల బియ్యం పురుగు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక బియ్యాన్ని నిల్వ చేసే ప్రదేశం చుట్టూ తేమ లేకుండా చూసుకోవాలి. ఇంగువను ఉపయోగించి కూడా మనం బియ్యం పురుగు పట్టకుండా చేయవచ్చు. దీని ఘాటైన వాసన కారణంగా బియ్యానికి పురుగులు రాకుండా ఉంటాయి. ఇంగువ పొడిని చిన్న మూటలుగా కట్టి బియ్యంలో అక్కడక్కడ ఉంచాలి. ఇలా చేయడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.
కర్ఫూరాన్ని కూడా ఇదే విధంగా మూటలుగా కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి. బియ్యం పురుగు పట్టకుండా చేయడంలో వేపాకు ఎంతో సహాయపడుతుంది. బియ్యాన్ని నిల్వ చేసుకునే డబ్బా అడుగు భాగాన వేపాకును ఉంచి ఈ వేపాకుపై బియ్యాన్ని పోయాలి లేదా వేప చెట్టు ఆకుల పొడిని మూటలుగా కట్టి బియ్యంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.
Read Also:Tea plantations: టీ తోటలను కాపాడేందుకు ఇంత కష్టపడ్డారా?
వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి బియ్యంలో ఉంచడం వల్ల బియ్యం పురుగు రాదు. బియ్యం పురుగుపట్టకుండా చేయడంలో లవంగాలు సమర్థవంతంగా పని చేస్తాయి. బియ్యంలో లవంగాలను ఉంచడం వల్ల లేదా లవంగాల పొడిని వస్త్రంలో కట్టి బియ్యంలో ఉంచడం వల్ల కూడా పురుగు పట్టకుండా ఉంటుంది.
ఒక వస్త్రంలో గుప్పెడు ఉప్పును ఉంచి మూటగా కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగులు రావు. ఇలా పురుగులు పట్టిన బియ్యంలో ఉంచినా కూడా పురుగులు తొలగిపోతాయి. ఎండబెట్టిన కాకరకాయ ముక్కలను లేదా వాటి పొడిని మూటగా కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ విధంగా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం బియ్యానికి పురుగు పట్టకుండా చేయవచ్చు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!