CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్
- డ్రైవర్, కండక్టర్‌తో ఫొటోలు
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ గురువారం చెన్నైలో కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 300 కొత్త ప్రభుత్వ బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం.. బస్సులో ప్రయాణిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బస్సు సిబ్బందితో మమేకమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా ప్రవేశపెట్టిన బస్సుల్లో విజయ్ ప్రయాణించారు. ప్రయాణం సందర్భంగా బస్సు డ్రైవర్, కండక్టర్లతో మాట్లాడి వారి పనితీరును తెలుసుకున్నారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయ్యాయి.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
తెల్ల చొక్కా, కళ్లజోడుతో కనిపించిన విజయ్ బస్సులో కూర్చుని ప్రయాణించగా.. ఆయన వెంట వచ్చిన మంత్రులు సమీపంలో నిలబడి ఉన్నారు. ఒక వీడియోలో విజయ్ కండక్టర్‌తో సుదీర్ఘంగా మాట్లాడుతున్నట్లు కనిపించగా.. మరో వీడియోలో ఆయన కండక్టర్‌తో కలిసి ఫొటోకు పోజ్ ఇచ్చారు. అలాగే డ్రైవర్ భుజంపై ప్రేమగా చేయి వేసి అభినందించిన దృశ్యాలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. బస్సు ప్రయాణం మొత్తం సమయంలో రహదారుల వెంట నిలిచిన ప్రజలకు విజయ్ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. దీంతో ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు చేరుకున్నారు.
ఈ 300 కొత్త బస్సులను తమిళనాడు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ నిర్వహించిన ప్రధాన ప్రజా కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.
VIDEO | Chennai: Tamil Nadu CM Vijay flags off 300 new Tamil Nadu State Transport Corporation buses, takes a ride in one of the newly launched buses. #TamilNaduNews #CMVijay
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/GYwLqSM3GA
— Press Trust of India (@PTI_News) June 25, 2026
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!