NTV Telugu Site icon

Karnataka: కర్ణాటకలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు.. 26మంది ఆఫ్రికన్ మహిళలు అరెస్ట్

Karnataka

Karnataka

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో 26 మందికి పైగా ఆఫ్రికన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం బెంగళూరులోని ఎంజీ రోడ్డు, బ్రిగేడు రోడ్లలో ఉన్న బార్లు, పబ్బులపై కేంద్ర విభాగ పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 26 మందికిపైగా ఆఫ్రికన్లు అనైతిక కార్యక్రమాలు చేస్తూ పట్టుబడ్డారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక డీసీపీ శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నగరంలో భారీగా పోలీసులు తనిఖీలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలతో నగరంలో జరుగుతున్న నేర కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపాలని బార్లు, పబ్బుల మీద పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో డ్రగ్స్ తో పాటు అనేక ఇతర అనైతిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ఆఫ్రికన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, పురుషులతో కలిపి 26 మందికి పైగా ఆఫ్రికన్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read Also: Honda Unicorn Launch: సరికొత్త బైక్‌ను విడుదల చేసిన హోండా.. బెస్ట్ ఫీచర్లు! 10 సంవత్సరాల వారంటీ

వీరందరిని పోలీసులు డ్రగ్స్ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే.. పోలీసుల దాడి సమయంలో ఆ ప్రదేశంలో హైడ్రామా నెలకొంది. పోలీసులను చూడగానే అరెస్టు చేయడానికి వచ్చారని అర్థమైన ఆఫ్రికన్ మహిళలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. వారి వెంట ఒక యువకుడు కూడా పారిపోయాడు. అయితే, ఇది గమనించిన పోలీసులు ఆ యువకుడిని వెంటాడి పట్టుకున్నారు. ఇక మరి కొంతమంది యువతులు అయితే మద్యంమత్తులో పోలీసులతో గొడవ పెట్టుకున్నారు.

Read Also: Karnataka Anna Bhagya : తలపట్టుకుంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. కేసీఆర్ కు ఫోన్ చేసి

మద్యం మత్తులో పోలీసులపై రెచ్చిపోయిన ఆఫ్రికన్ యువతులు రోడ్డు మీదే రచ్చ రచ్చ చేశారు. దీంతో వీరందరిని పోలీసులు బౌరింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడే వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆఫ్రికన్లు, ఇతర విదేశీయులు డ్రగ్స్ తీసుకున్నట్లుగా వైద్య పరీక్షల్లో రుజువైయ్యాయి. దీంతో, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక అరెస్టు చేసిన ఆఫ్రికన్లను కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అరెస్టైన ఆఫ్రికన్ల పాస్ పోర్ట్స్, వీసా తీసుకురావాలని పోలీసులు తెలిపారు. అయితే, వీటిని ఎవరూ తీసుకురాకపోవడంతో అరెస్ట్ అయిన అనేక మందిపై డ్రగ్స్ కేస్ తో పాటు అక్రమ వలస కేసులను కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ సోదాల్లో వీరి దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పోలీసులు తెలిపారు. కానీ వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అనే దానిమీద పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండో రోజు కూడా పోలీసులు బెంగళూరులో విసృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, వ్యభిచారంపై ఉక్కపాదం మోపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Show comments