Site icon NTV Telugu

Bengaluru: ప్రముఖ కన్నడ సాహితీవేత్త కమల హంపన కన్నుమూత

Hampana

Hampana

ప్రముఖ కన్నడ సాహితీవేత్త ‘నాడోజ’ కమల హంపన (88) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె కన్నుమూశారు. శనివారం బెంగళూరులోని రాజాజీ నగర్ నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హంపనా వయసు 88. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమెకు కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డుతో సహా పలు అవార్డులు లభించాయి. హంపన మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండి: Darshan Case: రేణుకా స్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీకి యాక్టర్ దర్శన్..

1935 అక్టోబర్ 28న బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో హంపన జన్మించారు. ఈ సాహితీవేత్త అనేక పుస్తకాలను రచించారు. అధ్యాపకురాలిగా కెరీర్ ప్రారంభించిన ఈమె అంచెలంచెలుగా సాహిత్యరంగంలో పేరు తెచ్చుకున్నారు. హంపనాకు కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, దాన చింతామణి అత్తిమబ్బే అవార్డు, కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ అవార్డుతో సహా పలు అవార్డులు అందుకున్నారు. హంపనా మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Heavy rainfall warning: తెలుగు రాష్ట్రాల సహా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

 

Exit mobile version