నిర్మాత ఎస్.కె.ఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో పంచులు వేస్తూ స్పీచ్‌లు ఇచ్చే ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు, పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. అయితే, ఆయన అనుకోకుండా చేసిన ఒక గుప్త సాయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసలు విషయం ఏమిటంటే, రేఖా బోజ్ అనే ఒక నటి విశాఖపట్నం కేంద్రంగా పలు సినిమాల్లో నటించింది.
Also Read: Asia Cup 2025: ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఫ్గాన్ సారథికి ప్రశ్న.. తెగ ఇబ్బందిపడ్డ పాక్ కెప్టెన్!
గతంలో తెలుగు హీరోయిన్స్‌ను సినిమాల్లో పెట్టుకోమని ఎస్.కె.ఎన్ చేసిన కామెంట్లను ఆధారంగా చేసుకుని, ఆమె ఎస్.కె.ఎన్ మీద విమర్శలు చేసింది. అప్పట్లో సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. అయినా సరే, ఎస్.కె.ఎన్ మాత్రం అవేవీ మనసులో పెట్టుకోలేదు. కొద్దిరోజుల క్రితం తన తండ్రికి అనారోగ్యం అని సదరు నటి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ను చూసి, ఆమెను సంప్రదించిన ఎస్.కె.ఎన్., ఆమె తండ్రి ఆపరేషన్ కోసం ఆయన ఖర్చులను స్వయంగా భరించాడు. ఈ విషయాన్ని ఆయన బయటకు చెప్పలేదు, కానీ రేఖా బోజ్ సన్నిహితుల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, ఒకసారి అపార్థం చేసుకుని తనమీద కామెంట్స్ చేసిన నటికి కూడా ఎస్.కె.ఎన్ సాయం చేశాడనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
