నిర్మాత ఎస్.కె.ఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో పంచులు వేస్తూ స్పీచ్‌లు ఇచ్చే ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు, పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. అయితే, ఆయన అనుకోకుండా చేసిన ఒక గుప్త సాయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసలు విషయం ఏమిటంటే, రేఖా బోజ్ అనే ఒక నటి విశాఖపట్నం కేంద్రంగా పలు సినిమాల్లో నటించింది.…