Site icon NTV Telugu

Vijay Deverakonda Movie: రెండు భాగాలుగా విజయ్‌ సినిమా.. ప్రొడ్యూసర్ నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Vijay Deverakonda

Vijay Deverakonda

Producer Suryadevara Naga Vamsi on VD 12: గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమా ‘వీడీ 12’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ కలిసి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీడీ 12 నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అభిమానుల్లో అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీడీ 12ను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

నాగవంశీ మాట్లాడుతూ… ‘విజయ్‌ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు. రెండు పార్టులకు సంబంధించి మంచి కంటెంట్‌ మా వద్ద ఉంది. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో భాగం తెరకెక్కిస్తాం. గౌతమ్‌ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం మాకు ఉంది. విజయ్‌ బాగా కష్టపడుతున్నాడు. అతడి శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది’ అని అన్నారు.

Also Read: John Cena: ఆ హీరో మాటలు నా జీవితాన్ని మార్చాయి: జాన్‌ సీనా

యాక్షన్‌ డ్రామాగా వీడీ 12 రూపొందుతోంది. ఇందులో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరో సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం శ్రీలంకలో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60-70 శాతం షూటింగ్‌ పూర్తయింది. వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version