Funky : ఫంకీ’లో క్రేజీ సర్ప్రైజ్.. ఆ ఇంట్రెస్టింగ్ కామియో ఎవరిదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సృజనాత్మక దర్శకుడు అనుదీప్ కె.వి.ల కలయికలో వస్తోన్నచిత్రం ‘ఫంకీ‘. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫిబ్రవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ కామియో ఉందని, అది సినిమాకు హైలైట్‌గా నిలవనుందని ఒక టాక్ టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది.
Also Read : Spirit : స్పిరిట్ నుండి ప్రకాష్ రాజ్ తప్పుకోవడానికి కారణం ఇదే..
Also Read
ఆ అతిథి పాత్ర మరెవరిదో కాదు ఈ సినిమా నిర్మాత, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సూర్యదేవర నాగవంశీ అని సమాచారం. నిర్మాతగా టాప్ లో ఉన్న నాగవంశీ ఇప్పుడు నటుడిగా ఫంకీలో ఒక కీలక సన్నివేశంలో తళుక్కున మెరవనున్నారట. అనుదీప్ కె.వి. తన సినిమాల్లో ఇలాంటి సర్ప్రైజ్‌లను ప్లాన్ చేయడంలో సిద్ధహస్తుడు. నాగవంశీని వెండితెరపై ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక స్ట్రగులింగ్ డైరెక్టర్ పాత్రలో కనిపిస్తుండగా, కయాదు లోహర్ నిర్మాతగా అలరించనుంది. ‘జాతిరత్నాలు’ తరహాలో ఈ సినిమా కూడా హిలేరియస్ ఎంటర్టైనర్‌గా ఉంటుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ స్పష్టం చేసింది. సినిమా పరిశ్రమపై సెటైరికల్ కోణంలో సాగే ఈ చిత్రంలో నాగవంశీ సాంగ్ లోనో లేదా మరేదైనా ఫన్నీ పాత్రలో కనిపిస్తారో చూడాలి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటనేమీ లేకపోయినా, ఈ గాసిప్ మాత్రం సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్‌బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్‌లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!