NTV Telugu Site icon

Priyanka Gandhi: రేపు, ఎల్లుండి తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇదే

Priyanka

Priyanka

Priyanka Gandhi: ఎన్నికలకు మరో వారం రోజులపాటు సమయం ఉండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్నీ నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ చేసుకుని ప్రచారం చేస్తున్నారు ముఖ్య నేతలు.. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ. రేపు, ఎల్లుండి ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు పాలకుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మ. 1:30 గంటలకు హుస్నాబాద్ లో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 3:00 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.

Read Also: Visakhapatnam: విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు

రేపు రాత్రి ప్రియాంక గాంధీ ఖమ్మంకు చేరుకుని.. రాత్రి అక్కడే బస చేయనున్నారు. 25న ఉదయం 11:00 గంటలకు ఖమ్మం, పాలేరులో ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి సత్తుపల్లి చేరుకుని.. మధ్యాహ్నం 1:30కి అక్కడ ప్రచారం చేయనున్నారు. అనంతరం 2: 40 నుండి 3:30 వరకు మధిర ప్రచార సభలో ప్రియాంక పాల్గొననున్నారు. సభ అనంతరం.. అక్కడి నుండి విజయవాడకు చేరుకొని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్ళనున్నారు.

Read Also: Mamata Banerjee: మీరు మా వాళ్లను నలుగుర్ని లోపలేస్తే, నేను 8 మందిని జైలులోకి పంపుతా.. బీజేపీకి దీదీ వార్నింగ్…

Show comments