NTV Telugu Site icon

Priyanka Gandhi: రేపు మధ్యప్రదేశ్లో ప్రియాంక గాంధీ పర్యటన.. అధికారమే లక్ష్యంగా..!

Priyanka

Priyanka

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రాజకీయ ఎత్తుగడలు మాత్రం మొదలయ్యాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ పాకులాడుతుండగా.. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందుకోసం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల సమరంలో జోరుమీదున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ.. శుక్రవారం గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో పర్యటించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు గ్వాలియర్-చంబల్ ప్రాంతం కంచుకోటగా ఉంది. సింధియా బీజేపీలో చేరిన తర్వాత గ్వాలియర్-చంబల్ ప్రాంతంపై కాంగ్రెస్ కన్నేసింది. ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రియాంక గాంధీ పన్నాగాలు పన్నుతున్నారు.

Project K: ‘ప్రాజెక్ట్ కె’ కామిక్ ఆర్ట్ పోస్టర్స్ లీక్.. స్టోరీ తెలిసిపోయింది.. ?

ఇప్పటికే జూన్ 12న ప్రియాంకగాంధీ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించి.. ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మహిళలకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయంతో సహా ఐదు పథకాలను అమలు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మరియు పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరణ చేస్తామన్నారు. మరోవైపు అక్కడి ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించింది. కాంగ్రెస్‌ నుండి బిజెపిలో చేరిన నాయకుడు కేంద్ర మంత్రి సింధియాపై కూడా విరుచుకుపడింది. కాంగ్రెస్ కు విధేయుడిగా ఉన్న సింధియా.. 2020 మార్చిలో బిజెపిలో చేరారు. దీంతో 15 నెలల్లో కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం పతనానికి దారితీసింది. అంతేకాకుండా చౌహాన్ తిరిగి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది.

MLC Kavitha: తొమ్మిదేళ్లలోనే 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు.. 30 లక్షల ఉద్యోగాలు

గ్వాలియర్-చంబల్ ప్రాంతం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కింగ్ మేకర్ కంటే తక్కువ కాదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గ్వాలియర్-చంబల్ సంభాల్ ప్రాంతంలోని 34 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 26, బీజేపీ 7, బీఎస్పీ ఒక సీటు గెలుచుకున్నాయి. ఈ విధంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంలో గ్వాలియర్-చంబల్ ప్రాంతం ప్రధాన పాత్ర పోషించింది. అయితే కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేల తిరుగుబాటు కూడా కమల్ నాథ్ ప్రభుత్వ ఉపసంహరణకు కారణంగా మారింది. సింధియా కాంగ్రెస్ నుండి నిష్క్రమణ తర్వాత.. గ్వాలియర్ ప్రాంతంలో కాంగ్రెస్ సొంతంగా నిలబడే కసరత్తులో నిమగ్నమై ఉంది. అంతేకాకుండా సింధియాకు సన్నిహితంగా ఉన్న నాయకులను కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది.