NTV Telugu Site icon

Rahul Gandhi: ప్రియాంకకు ముద్దు పెట్టిన రాహుల్ ఫోటో వైరల్

Rahul

Rahul

Rahul Gandhi: కన్యాకుమారి నుంచి కాశీ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్తర ప్రదేశ్లోకి ప్రవేశించింది. భారత్‌ జోడో యాత్రలో ఇవాళ ఆయన సోదరి, కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్‌ సీనియర్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా భాగస్వాములయ్యారు. ఈ మధ్యాహ్నం రాహుల్‌గాంధీ యాత్ర ఢిల్లీ నుంచి యూపీలోకి ప్రవేశించగానే అక్కడి కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం ప్రియాంకాగాంధీ, ఫరూఖ్‌ అబ్దుల్లా రాహుల్‌గాంధీని కలిసి యాత్రలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఫరూఖ్‌ అబ్దుల్లాను రాహుల్‌గాంధీ గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. అలాగే సోదరి ప్రియంకగాంధీకి రాహుల్ ముద్దు పెట్టారు. ఆత్మీయతను చాటే ఆ ముద్దు ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Read Also: World tallest man : ప్రపంచంలోని పొడవైన వ్యక్తి.. ఎత్తు కొలవాలంటే స్టూల్ ఎక్కాల్సిందే

రాహుల్ గాంధీ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా గత సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్న రాహుల్‌గాంధీ దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే తన యాత్రను పూర్తి చేసుకున్నారు. ఇక మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీలో కూడా రాహుల్‌ యాత్ర పూర్తయ్యింది. ఇవాళే ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోకి భారత్‌ జోడో యాత్ర ప్రవేశించింది.

Show comments