NTV Telugu Site icon

Priyanka Gandhi: మోడీని మామయ్య అంటూ పిలిచిన ప్రియాంక గాంధీ

Priyanka

Priyanka

గుజరాత్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగంలో కీలక మార్పులు చేస్తామని, స్వయంగా బీజేపీ నేతలే మీడియా చెప్తున్నారని గుర్తు చేశారు. గుజరాత్‌లోని వల్సాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అనంత్ పటేల్‌కు మద్దతుగా ఇవాళ ( శనివారం ) ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు.

Read Also: Mobile Internet: ఫోన్‌లో ఇంటర్నెట్‌ స్లోగా వస్తోందా.. అయితే ఇలా చేయండి..

కాగా, వల్సాద్ జిల్లాలోని ధరంపూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదలకు మోడీ పాలనా వైఫల్యమే కారణమని విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీని ‘మెహంగాయీ మ్యాన్’ అని పిలిస్తే బాగుంటుందని వ్యాఖ్యనించింది. అయితే, బీజేపీ నేతలు ప్రధాని మోడీ శక్తిమంతుడని పొగుడుతున్నారు.. మోడీ చిటికె వేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందంటున్నారు.. అలాంటప్పుడు ఆయన మన దేశ పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రస్తుతం, సార్వత్రిక ఎన్నికల ఉండటం వల్లే ప్రధాని మోడీ సిలిండర్ల ధరలను తగ్గించారు.. అంతేగానీ, ఆయనకు ప్రజలపై సానుభూతి లేదని ఆమె వెల్లడించారు.

Read Also: Imran Khan: దేశాన్ని బానిసగా మార్చిన వారితో రాజీపడబోం.. జైల్లో ఉండేందుకూ సిద్ధమే..

అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీ నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తానని మోడీ మామయ్య ఎప్పుడో ఒకప్పుడు చెప్పడం మొదలు పెట్టే అవకాశం ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈరోజు దేశ ప్రధానమంత్రి తన పదవిని దృష్టిలో ఉంచుకుని మీతో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని ఆమె మండిపడ్డారు. అయితే, రాజస్థాన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తల్లులు, సోదరీమణుల బంగారం లెక్కింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిందని చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చింది.