NTV Telugu Site icon

Priyanka Gandhi: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రియాంక గాంధీ.. ఎమన్నారంటే?

Priyanka Gandhi

Priyanka Gandhi

ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్ చూస్తే.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. బీజేపీ 38 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 2020 ఢిల్లీ అల్లర్ల వల్ల ప్రభావితమైన, ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే అసెంబ్లీ స్థానాల ఫలితాలపై అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉండగా.. గత రెండు ఎన్నికల్లో కూడా ఒక్క సీటు గెలవలేదు. ఈ సారి కూడా ఒక్క సీటులో కూడా ముందంజలో లేదు. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. “ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి నాకు తెలియదు. నేను ఇంకా ఫలితాలను తనిఖీ చేయలేదు.” అని ఆమె అన్నారు.

READ MORE: Naga Chaitanya : సమంతతో డివోర్స్.. నాగ చైతన్య కీలక కామెంట్స్..

కాగా.. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ పరాజయంపై జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్ చేశారు.. ఇండియా కూటమిపై విమర్శలు చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా.. మనం మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలానే వస్తాయని హితవు పలికారు.. ఇంకా కొట్లాడుకోండి ఇంకా దారుణ ఫలితాలు వస్తాయి అని హేళన చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాంట్ ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.