NTV Telugu Site icon

Rahul Gandhi: అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సన్నాహాలు..

Rahul

Rahul

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ అగ్రనాయకత్వం నుంచి సంకేతాలు అందడంతో స్థానిక కాంగ్రెస్ కమిటీ చురుగ్గా ప్రచారం చేస్తుంది. కాగా, నేడు లేదా రేపు రాహుల్ గాంధీ బృందం అమేథీకి వెళ్లబోతుంది. నేటి నుంచి అమేథీలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కానీ, బీజేపీ మినహా ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని ఇప్పటి వరకు అమేథీలో ప్రకటించలేదు. అయితే, గురువారం నాడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయబోతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి పై స్థాయి నుంచి స్పష్టమైన సూచనలు రావడంతో కాంగ్రెస్ కార్యాలయంలో సీనియర్ నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి.

Read Also: Jagdeep Dhankhar: నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్.. కన్హా శాంతివనం సందర్శన..

కాగా, మే 2వ తేదీన అమేథీలో రాహుల్‌ గాంధీ నామినేషన్‌ దాఖలు చేస్తారని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమ ఎన్నికల నిర్వహణను చూసేందుకు ఢిల్లీ నుంచి పలువురు ప్రముఖులు శనివారం లేదా ఆదివారం అమేథీకి చేరుకుంటున్నారు. ఇక, రాహుల్ కూడా అమేథీకి రాకముందే అయోధ్యకు వెళ్లే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. భారత్ జోడో యాత్ర అమేథీలో ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ అయోధ్యలో పర్యటించాలని ప్లాన్ చేశారు. కానీ, ఆ తరువాత దానిని రద్దు చేయారు. ఇక, నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోగేంద్ర మిశ్రా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోందన్నారు. ఇక, ఎన్నికల నిర్వహణను చూసే బృందం మొత్తం మరో ఒకటి రెండు రోజుల్లో అమేథీకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Read Also: Dear OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అయితే, అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థిత్వానికి సంబంధించి అన్ని విషయాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. రాహుల్, ప్రియాంక పేర్లపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అదే సమయంలో ప్రియాంక గాంధీ గురువారం నాడు రాయ్‌బరేలీకి రావడంపై కూడా చర్చ జరిగింది. ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరును ఏఐసీసీ ప్రకటిస్తుందని విశ్వసనీయ సమాచారం.

Show comments