Varanasi : మహేష్ ఎక్స్‌ప్రెషన్‌.. డ్యాన్స్‌పై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

Varanasi Mahesh Priyanka

Varanasi Mahesh Priyanka

సూపర్‌స్టార్ మహేష్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (SSMB29) ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా తోడయ్యారు. ఈ క్రమంలో మహేష్ బాబు డ్యాన్స్ స్టైల్ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. మహేష్ బాబు తన డ్యాన్స్ గురించి వివరిస్తుంటే, ప్రియాంక చోప్రా కూడా ఆయన ఎనర్జీని చూసి ఆశ్చర్యపోతూ ప్రశంసలు కురిపించారు.

Also Read : Peddi: శిష్యుడి కోసం రంగంలోకి దిగిన సుకుమార్.. ‘పెద్ది’పై స్పెషల్ ఫోకస్!

మహేష్ బాబు ఒక పాటలోని కష్టమైన స్టెప్పుల గురించి మాట్లాడుతుండగా, ప్రియాంక చోప్రా ఆయన వైపు చూస్తూ రియాక్షన్ ఇస్తూ.. ‘మహేష్ బాబు డ్యాన్స్ చాలా యూనిక్‌గా ఉంటుంది, ఆయన మొహంలో ఉండే ఆ చిన్న స్మైలే సగం ఎనర్జీని ఇస్తుంది. కానీ స్టెప్స్ కొంచం కష్టంగా ఉంటే చాలు ఒక క్యూట్ ఎక్స్‌ప్రేషన్ ఇస్తారు’ అంటూ ప్రియాంక చేపిన విషయాలు వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ లెవల్‌లో మహేష్ బాబు డ్యాన్స్ గురించి ఇంతటి చర్చ జరగడం, దానికి ప్రియాంక చోప్రా వంటి స్టార్ తోడవ్వడంతో ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో మహేష్ బాబు మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఉండబోతున్నాయా? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.