Site icon NTV Telugu

Priyanka Chopra : నా తండ్రి చివరి రోజుల్లో కూడా.. పక్కన ఉండలేకపోయా

Priyanka Chopra

Priyanka Chopra

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం గురించి, వ్యక్తిగత జీవితంలో చేసిన త్యాగాల గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ స్థాయికి రావడానికి తాను ఎంత కష్టపడింది, ఏమేమి కోల్పోయిందో ఆమె పంచుకుంది. ఈ మాటలు విన్న అభిమానుల హృదయాలు బరువెక్కుతున్నాయి..

Also Read : Varanasi : జక్కన్న మాస్టర్ ప్లాన్ రివీల్..మహేష్ బాబు ‘వారణాసి’లో మొత్తం 5 అవతారాలు?

‘‘కెరీర్ మొదట్లో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో తెలియక, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకున్నా. అప్పుడు తన 20 ఏళ్ల వయసులో ఖాళీ లేకుండా ప్రాజెక్ట్‌లు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.. ఇప్పుడు నా త్యాగానికి అవతలి వైపు చూస్తున్నట్లు ఉంది. నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఈ ప్రయాణంలో నా పుట్టినరోజు, పండుగలు సెలబ్రేట్ చేసుకోలేకపోయాను, కుటుంబం తో గడిపిన సందర్భాలు చాలా తక్కువ’ అని తెలిపింది. అంతే కాదు..‘నా తండ్రి ఆసుపత్రి‌లో ఉంటే ఆయన చివరి రోజులలో కూడా నేను దగ్గర ఉండి చూసుకోలేకపోయా‌ను’ అంటూ కన్నీరు పెటుకుంది.

అప్పుడు అంత కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు నచ్చిన, బలమైన స్రీప్ట్‌లకు మాత్రమే ఓకే చెబుతున్నట్లు తెలిపారు. రీసెంట్‌గా ఆమె నటించిన ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ బాబు హీరోగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో ‘మందాకిని’ అనే ముఖ్య పాత్రలో నటిస్తోంది.. అయితే ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నానని, తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పనున్నట్లు కూడా ప్రియాంక చోప్రా వెల్లడించారు. ప్రజంట్ ప్రియాంక మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version