Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medical Student Priyanka Case: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు హత్యాయత్నం కింద నమోదైన కేసును.. ఆమె మృతి చెందడంతో హత్య నేరం కిందకు మార్చారు. ఈ మేరకు కేసులోని సెక్షన్లను పోలీసులు సవరించారు. ప్రియాంక మృతి నేపథ్యంలో గతంలో నమోదు చేసిన BNS సెక్షన్ 110ను తాజాగా BNS సెక్షన్ 106గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఇద్దరు నిందితులను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ రాజమహేంద్రవరం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక మృతి నేపథ్యంలో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించడం ద్వారా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు, కారణాలు, ఇతర అంశాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. కోర్టు నిర్ణయం అనంతరం నిందితుల విచారణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
మరోవైపు.. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ప్రియాంక మృతదేహం ఉంది.. కిమ్స్ మార్చురీలో ప్రియాంక మృతదేహాన్ని భద్రపరిచారు వైద్యులు.. ఇప్పటికే రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు రాజమండ్రి పోలీసులు .. కిమ్స్ లో శవ పంచనామా అనంతరం మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించనున్నారు.. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు.. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు ప్రియాంక మృతదేహాన్ని అప్పగించనున్నారు పోలీసులు.. గద్వాల జిల్లాలోని అయిజ మండలంలోని ఎక్లాస్పూర్ ప్రియాంక తల్లిదండ్రుల స్వస్థలం కాగా.. చాలా కాలంగా హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు ప్రియాంక కుటుంబ సభ్యులు.. తమ కలల సౌధం కూలిపోయిందని ప్రియాంక తల్లిదండ్రులు బోరును విలపిస్తున్నారు.. మరోవైపు.. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయాల ఆర్థిక సహాయం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం..
రాజమండ్రిలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలపాలైన మెడికో ప్రియాంక.. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 3.32 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం విదితమే..
తాజావార్తలు
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!