Aadujeevitham OTT: నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి ‘ఆడు జీవితం’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadujeevitham OTT Release Date Telugu: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సినిమా ‘ఆడు జీవితం’ (ది గోట్ లైఫ్). బ్లెస్సీ దర్శకత్వం వహించినఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఆడు జీవితం ఓటీటీ విడుదల కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా జులై 19 నుంచి ఆడు జీవితం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఎట్టకేలకు ఓటీటీలోకి ఆడు జీవితం వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. ఓటీటీలో రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
Also Read: Sourav Ganguly: నన్ను అందరూ మర్చిపోయారు.. సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు!
కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ ‘ఆడు జీవితం’. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెబుతూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ను రచించారు. 2008లో ఈ నవల అత్యధికంగా అమ్ముడైంది. గోట్ డేస్‌ను సినిమాగా తీయాలనే ఆలోచనతో డైరెక్టర్ బ్లెస్సీ హక్కులు కొనుగోలు చేశారు. 10 ఏళ్లకు పైగా శ్రమించి ఆడు జీవితంను ఆయన తెరకెక్కించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఎంతో కష్టపడిన పృథ్వీరాజ్‌కు మంచి విజయమే దక్కింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!