Prithvi Shaw: టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా డేటింగ్.. ఫొటోస్ వైరల్!
- టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా డేటింగ్
- గణేశుడి విగ్రహం పక్కన నిలబడి ఉన్న ఫోటో వైరల్
- పెయిర్ బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithvi Shaw Dating with Akriti Agarwal: టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతడు వార్తల్లో నిలిచింది తన ఆటతో మాత్రం కాదు. రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్, టాలీవుడ్ హీరోయిన్ అకృతి అగర్వాల్‌తో కలిసి 2025 గణేశ్ చతుర్థిని పృథ్వీ షా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ అకృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇద్దరూ గణేశుడి విగ్రహం పక్కన నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెయిర్ బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఈ అకృతి అగర్వాల్ ఎవరు అని నెటిజెన్స్ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. అకృతి అగర్వాల్ 2 మే 2003న లక్నోలో జన్మించారు. ఆమె డిజిటల్ కంటెంట్ సృష్టికర్త, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ముంబైలోని నిర్మలా మెమోరియల్ ఫౌండేషన్ కళాశాలలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. డిగ్రీ చదువుతున్నప్పుడు అకృతి సోషల్ మీడియా మొగ్గు చూపారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో టిక్‌టాక్‌లో డ్యాన్స్ వీడియోలు చేసి పాపులర్ అయ్యారు. భారతదేశంలో టిక్‌టాక్ నిషేధించబడిన తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌పై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆమెకు 3.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ ఛానెల్‌కు 88.8 వేలమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘త్రిముఖ’ అనే టాలీవుడ్ మూవీలో ఆకృతి హీరోయిన్గా నటించారు. ఇక బాలీవుడ్ ఆరంగేట్రంకు సిద్ధమవుతున్నారు.
Also Read
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
Also Read: Lakshmi Menon: యువకుడి కిడ్నాప్ కేసు.. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట!
మరోవైపు ఫామ్ కోల్పోయిన ప్రథ్వీ షా భారత జట్టులో చోటు కోల్పోయాడు. ముంబై క్రికెట్ అసోషియేషన్‌కు టాటా చెప్పిన అతడు.. ప్రస్తుతం మహారాష్ట్రకు ఆడుతున్నాడు. బుచ్చిబాబు టోర్నీ 2025లో ఆడుతున్న ప్రథ్వీ షా.. ఛత్తీస్‌ఘడ్ (111)పై సెంచరీ చేశాడు. తమిళనాడుపై కూడా హాఫ్ సెంచరీ బాది సత్తాచాటాడు. ఇదే జోరును కొనసాగిస్తే ఐపీఎల్ 2026లో ఆడే ఛాన్స్ ఉంటుంది. ప్రథ్వీ షా చివరిసారిగా జూలై 2021లో భారత్ తరపున ఆడాడు. నటి నిధి తపారియాతో బ్రేకప్ తర్వాత అకృతితో అతడు ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి ముంబైలో చాలాసార్లు జంటగా కనిపించారు.
తాజావార్తలు
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా అనుపమ్ ఖేర్!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!