Site icon NTV Telugu

Chandrababu Security: చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు..

Prisons Department Dig

Prisons Department Dig

Chandrababu Security: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో తన భద్రత, ఆరోగ్యంపై ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దీనిపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ నేతులు మాత్రం బెయిల్‌ కోసం చంద్రబాబు ఆడే కొత్త డ్రామా ఇది అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు.. అయితే, చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబుకి 24 గంటలు మొదటి నుంచి సెక్యూరిటీ ఏర్పాటు చేశాం అన్నారు.. అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. కంట్రోల్ రూమ్‌ నుంచి ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం అన్నారు.

Read Also: Nani: సీతమ్మకు బొట్టు పెడుతున్న రామయ్యలా ఉన్నావయ్యా..

మావోయిస్టు పార్టీ లెటర్ వచ్చిందని చెప్తున్నారు.. దీనిపై విచారణ చేశాం… అది ఫేక్‌ లెటర్‌ అని తేలిందన్నారు జైళ్ల శాఖ డీఐజీ.. చంద్రబాబుకు సంబంధించిన బెదిరింపు లెటర్ ఫేక్ అని విచారణలో తేలిందని క్లారిటీ ఇచ్చారు.. ఇక, జైలు నుంచి చంద్రబాబు లెటర్ బయటకు వెళ్లిని లెటర్ కు జైలు అధికారులకు అటెస్టేషన్ చేయలేదన్నారు. చంద్రబాబు కుడి కంటి ఆపరేషన్ సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులను సంప్రదించాం.. వారు పరీక్షలు నిర్వహించారు.. అమెచ్యూర్ కేటరాక్ట్ ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. కొంత సమయం తర్వాత చేయవచ్చని వైద్యులు సూచించారని వివరించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి మేం ఎటువంటి తప్పుడు రిపోర్టు బయటికి ఇవ్వటం లేదని స్పష్టం చేశారు.. పూర్తి వివరాలు కోర్టుకు పంపుతున్నాం.. జైల్లో భద్రతకు సంబంధించి స్నేహ బ్యారేక్ లో చంద్రబాబును ఏ రూమ్ లో ఉంచామన్న విషయం బయటకు వెల్లడించడంలేదు.. కానీ, జైల్లో చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసాశాం… విచారం చేస్తున్నాం.. చంద్రబాబు భద్రతకు సంబంధించి ఎటువంటి అనుమానాలు అవసరం లేదన్నారు. చంద్రబాబు తనకు గతంలో ఉన్న ఎలర్జీల గురించి వైద్యులకు చెప్పారు.. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకి రెండు లెటర్లు రాశాం.. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించి ఎటువంటి చికిత్స అవసరమవుతుందో సజెషన్స్ ఇవ్వమని భువనేశ్వరికి కూడా తెలియజేశాం.. ఇదే విషయాన్ని కోర్టు కూడా తెలిపాం అని వెల్లడించారు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్.

Exit mobile version