NTV Telugu Site icon

US: ఉధృతం అవుతున్న పాలస్తీనా అనుకూల ఉద్యమం.. నిరాహార దీక్షకు పిలుపు

Us

Us

గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల ఆందోళనలతో అమెరికాలోని యూనివర్సీటీలు దద్దరిల్లుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడే విద్యార్థులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా యూనివర్సిటీల నుంచి విద్యార్థులను తొలగించారు. తాజాగా మరో ఉద్యమానికి విద్యార్థులు తెర లేపారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరాహారదీక్ష చేపట్టారు. పాలస్తీనా వివాదానికి సంబంధించి కాలేజీ బోర్డు తమ డిమాండ్లను నెరవేర్చే వరకు నిరాహారదీక్ష చేస్తామని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం తెలిపింది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌ను పూర్తిగా బహిష్కరించే వరకు నీళ్లు తప్ప ఆహారం.. పానీయాలకు దూరంగా ఉంటామని నిరసనకారులు ప్రకటించారు. ఈ మేరకు విద్యార్థి సంఘం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Nepal: నేపాల్ రూ. 100 నోటుపై కొత్త భూభాగాలు.. భారత్ తీవ్ర అభ్యంతరం..!

గాజాకు సంఘీభావం తెలిపే వారంతా నిరాహార దీక్షలో పాల్గొనాలని ప్రిన్సిటన్ విద్యార్థులు పిలుపునిచ్చారు. దీక్షలో పాల్గొనేవారు నీళ్లు తప్ప ఇంకేమీ తీసుకోవద్దని సూచించారు. పాలస్తీనాకు విముక్తి కలిగించే వరకు దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. డిమాండ్ల పరిష్కారం కోసమే నిరాహార దీక్ష చేస్తు్న్నట్లు ఒక విద్యార్థి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల బెదిరింపులకు భయపడమని తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి విముక్తి కలిగే వరకూ ఈ పోరాటం సాగిస్తామని విద్యార్థులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Brazil Rains : బ్రెజిల్‌లో వర్ష బీభత్సం.. 37మంది మృతి.. 74 మంది గల్లంతు

గత కొద్ది రోజులుగా ఆయా యూనివర్సిటీల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దీంతో నిరసనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. భారీగా క్యాంపస్‌ల్లో పోలీసులు మోహరించారు. నిరసనలు జరగకుండా ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. తాజాగా విద్యార్థులు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.