US: ఉధృతం అవుతున్న పాలస్తీనా అనుకూల ఉద్యమం.. నిరాహార దీక్షకు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల ఆందోళనలతో అమెరికాలోని యూనివర్సీటీలు దద్దరిల్లుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడే విద్యార్థులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా యూనివర్సిటీల నుంచి విద్యార్థులను తొలగించారు. తాజాగా మరో ఉద్యమానికి విద్యార్థులు తెర లేపారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరాహారదీక్ష చేపట్టారు. పాలస్తీనా వివాదానికి సంబంధించి కాలేజీ బోర్డు తమ డిమాండ్లను నెరవేర్చే వరకు నిరాహారదీక్ష చేస్తామని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం తెలిపింది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌ను పూర్తిగా బహిష్కరించే వరకు నీళ్లు తప్ప ఆహారం.. పానీయాలకు దూరంగా ఉంటామని నిరసనకారులు ప్రకటించారు. ఈ మేరకు విద్యార్థి సంఘం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Nepal: నేపాల్ రూ. 100 నోటుపై కొత్త భూభాగాలు.. భారత్ తీవ్ర అభ్యంతరం..!
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
గాజాకు సంఘీభావం తెలిపే వారంతా నిరాహార దీక్షలో పాల్గొనాలని ప్రిన్సిటన్ విద్యార్థులు పిలుపునిచ్చారు. దీక్షలో పాల్గొనేవారు నీళ్లు తప్ప ఇంకేమీ తీసుకోవద్దని సూచించారు. పాలస్తీనాకు విముక్తి కలిగించే వరకు దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. డిమాండ్ల పరిష్కారం కోసమే నిరాహార దీక్ష చేస్తు్న్నట్లు ఒక విద్యార్థి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల బెదిరింపులకు భయపడమని తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి విముక్తి కలిగే వరకూ ఈ పోరాటం సాగిస్తామని విద్యార్థులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Brazil Rains : బ్రెజిల్‌లో వర్ష బీభత్సం.. 37మంది మృతి.. 74 మంది గల్లంతు
గత కొద్ది రోజులుగా ఆయా యూనివర్సిటీల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దీంతో నిరసనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. భారీగా క్యాంపస్‌ల్లో పోలీసులు మోహరించారు. నిరసనలు జరగకుండా ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. తాజాగా విద్యార్థులు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
https://twitter.com/JackFought_1/status/1786433973456941523
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!