Site icon NTV Telugu

PM Modi: తలపాగాలో మెరిసిన ప్రధాని మోడీ..

Pm

Pm

75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తలపాగాలో మెరిశారు. ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి రిపబ్లిక్‌ డే, ఇండిపెండెన్స్‌ డే దినోత్సవాల్లో వేడుకల్లో తలపాగా కట్టుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2015 జనవరి 26 నుంచి ప్రతి సంవత్సంవరం ఒక్కో ప్రత్యేక కలిగిన తలపాగా ఆయన ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే, ఈ సారి ప్రధాని మోడీ కాషాయరంగు ‘బంధాని’ తలపాగాను ధరించారు.

Read Also: Minister Kottu Satyanarayana: పొత్తులో పవన్, చంద్రబాబు చివరివరకు ఉంటారనేది అనుమానమే!

ఇక, 2015లో ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రంగుల్లో ఉన్న తలపాగాను ధరించారు. ముదురు ఆకుపచ్చ, కాషాయం, గులాబీ రంగుల్లో ఉండగా.. మధ్యలో తెల్లని చుక్కలు కనిస్తున్నాయి. తలపాగాతో నల్లటి సూట్‌ను ప్రధాని ధరించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో కలిసి 66వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.
అలాగే, 2016లో ప్రధాని మోడీ ఎరుపు చారలతో పసుపు రంగులోని తలపాగాను ధరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ డార్క్ క్రీమ్ కలర్ ఫుల్ స్లీవ్ బంద్‌గాలా సూట్‌ను వేసుకున్నారు. దీంతో పాటు 2017లో రిపబ్లిక్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ గులాబీ రంగు తలపాగా వేసుకున్నారు. ఈ సఫాపై వెండి రంగు క్రాస్ లైన్‌లు కనిపిస్తాయి. తెల్లటి కుర్తా, దానిపై తెల్లటి చుక్కలు ఉన్న నల్లటి జాకెట్‌పై మోడీ మెరిసిపోయారు. అలాగే, 2018లో ప్రధాని మోడీ మల్టికలర్‌లోని తలపాగాను వేసుకున్నారు. సఫాతో ప్రధాని మోడీ క్రీమ్ కుర్తా, నలుపు రంగు జాకెట్ వేసుకొచ్చారు.

Read Also: Jana Reddy: రేవంత్ నెలరోజుల పాలన పై జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

అలాగే, 2019లో ప్రధాని మోడీ ఎర్రకోట జెండా ఎగురవేసి ప్రసంగించారు.. ఆ టైంలో ఆయన బహులవర్ణాల్లోని తలపాగా ధరించడం మనం చూడొచ్చు. ఎరుపు, పసుపు రంగులో ఉన్న తలపాగా వేసుకున్నారు. 2020లో ప్రధానమంత్రి కాషాయ రంగు ‘బంధేజ్’ తలపాగాను ధరించారు. సాంప్రదాయ కుర్తా పైజామా, దానిపై జాకెట్ వేసుకున్నాడు. ఇక, 2021లో రిపబ్లిక్ వేడుకల్లో మోడీ ప్రత్యేక తలపాగాలో కనబడుతున్నారు. ఎరుపు రంగు ‘హలారీ తలపాగా’ను వేసుకున్నారు. ఈ తలపాగాను జామ్‌నగర్‌ రాజకుటుంబం ప్రధాని మోడీకి బహుమతిగా ఇచ్చింది. 2022 గణతంత్ర వేడుకల్లో ప్రధాని తలపాగాకు బదులుగా టోపీ ధరించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన బ్రహ్మకమల్‌ క్యాప్‌ వేసుకున్నాడు. 2023లో ప్రధానమంత్రి రంగురంగుల రాజస్థానీ తలపాగా ధరించి అలరించాడు. తెల్లటి కుర్తా, ప్యాంట్‌తో నల్లటి కోటు ధరించిన ప్రధాని మోడీ తెల్లటి స్టోల్‌ ధరించారు.

Exit mobile version