INDvsAUS Test: భారత్-ఆసీస్ చివరి టెస్టుకు మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌తో జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆసీస్ జట్టు.. బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌లో ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. అదే విధంగా రోహిత్ సారథ్యంలోని భారత జట్టు కూడా శుక్రవారం నుంచి తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. ఇకపోతే, ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా వీక్షించున్నట్లు తెలుస్తోంది. మోడీతో పాటు ఆస్ట్రేలియా దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరకానున్నట్లు సమాచారం. మార్చి 9 నుంచి అహ్మదాబాద్ టెస్టు ప్రారంభం కానుంది.
సిరీస్ కోసం ఆసీస్ మాస్టర్ ప్లాన్
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ నాగ్‌పూర్‌లో జరగనుండగా ఆస్ట్రేలియా మాత్రం నాలుగు రోజుల సన్నాహక క్యాంప్‌ను బెంగళూరులో ఏర్పాటు చేసుకుంది. దీనికి కారణం ఆ టీమ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, స్పిన్ కన్సల్టెంట్ డానియల్ వెటోరీ. ఈ ఇద్దరికీ ఐపీఎల్ టీమ్ ఆర్సీబీతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో బెంగళూరు దగ్గరలోని ఆలూర్‌లో ఆస్ట్రేలియా ప్రత్యేకంగా తమకు కావాల్సినట్లుగా స్పిన్ పిచ్‌లను ఏర్పాటు చేయించుకొని మరీ ప్రాక్టీస్ చేస్తోంది. ఇండియన్ టీమ్ లోని అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ లాంటి స్పిన్నర్లు.. షమీ, సిరాజ్‌లాంటి పేసర్లను ఎదుర్కోవడానికి తగిన పిచ్‌లపై ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించింది. వీటిలో కాస్త తక్కువ స్పిన్ అయ్యే పిచ్‌లు, బాగా టర్న్ అయ్యే పిచ్‌లు, వేరియబుల్ బౌన్స్ ఉండే పిచ్‌లు ఉన్నాయి. నాగ్‌పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో స్పిన్ పిచ్లే ఎదురవుతాయని ఆస్ట్రేలియా ఇలాంటి పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తోంది.
నాలుగు టెస్టుల షెడ్యూల్
1. ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్
2. ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
3. మార్చి 1-5: ధర్మశాల
4. మార్చి 9- 13: అహ్మదాబాద్
Also Read: Jallikattu Protest : తమిళనాడులో ఉద్రిక్తత.. జల్లికట్టుకు అనుమతి ఇవ్వలేదని ఆందోళన
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!