రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. భారతదేశం సాధించిన విజయాలు, మన నుంచి ప్రపంచం ఆశించేవి, సామాన్యుల ఆత్మవిశ్వాసం, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరంగా చర్చించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. అనంతరం మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
READ MORE: Plane Crash: మధ్యప్రదేశ్‌లో కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లకు గాయాలు
రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. “కాంగ్రెస్ నుంచి ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ ఆశించడం పెద్ద తప్పు అవుతుంది. ఇది వారి ఆలోచనకు మించినది. ఇది వారి రోడ్ మ్యాపునకు అనుగుణంగా లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఒకే కుటుంబానికి అంకితం చేయబడింది. కాంగ్రెస్ పాలనలో, ప్రతిదానిలోనూ బుజ్జగింపులు ఉండేవి. ఇది వారి రాజకీయాలు చేసే విధానం. సమాజంలో కులం అనే విషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. చాలా సంవత్సరాలుగా, అన్ని పార్టీలకు చెందిన ఓబీసీ ఎంపీలు ఓబీసీ ప్యానెల్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అది కాంగ్రెస్ రాజకీయాలకు విరుద్ధంగా ఉంది. దీంతో హస్తం పార్టీ వారి డిమాండ్‌ను తిరస్కరించింది. కానీ మేము ఈ ప్యానెల్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చాం. దేశ ప్రజలు మా అభివృద్ధి నమూనాను పరీక్షించారు. అర్థం చేసుకున్నారు.. మద్దతు ఇచ్చారు.. మా పాలనలో మాకు దేశమే ముందు. 2014 తర్వాత, భారతదేశానికి విముక్తి లభించింది.” అని మోడీ వ్యాఖ్యానించారు.
READ MORE: Plane Crash: మధ్యప్రదేశ్‌లో కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లకు గాయాలు