NTV Telugu Site icon

PM Modi: హైదరాబాద్లో ప్రధాని మోడీ పర్యటన.. సిటీలో హై అలర్ట్

Modi

Modi

ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 7.50కు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సిటీలో హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. కాగా.. ఈరోజు రాత్రికి ప్రధాని మోడీ రాజ్ భవన్ లో బస చేయనున్నారు. అనంతరం.. రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.

మొన్న బెంగళూర్ పేలుళ్ల ఘటన దృష్ట్యా హైదరాబాద్ మోదీ పర్యటనలో నిఘా పటిష్టం చేశారు పోలీసులు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ జంక్షన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, యశోద హాస్పిటల్ మార్గంలో దారి మల్లింపు చర్యలు చేపట్టారు. ఈరోజు రాత్రి 7:40 నుండి రేపు ఉదయం 10:15 వరకు ట్రాఫిక్ డివెర్షన్ ఉండనుంది. కాగా.. అటుగా వెళ్లే వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ డైవెర్షన్స్ తో పాటు ప్రధాని వెళ్లే పలు రూట్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఇదిలా ఉంటే.. సోమవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 8 గంటలకు ఆయన రాజ్‌భవన్ నుంచి బయలుదేరి, రోడ్డు మార్గంలో మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. పట్టుచీరె, ఇతర కానుకలను అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత సంగారెడ్డికి వెళ్లనున్నారు. వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వాటి విలువ 15,718 కోట్ల రూపాయలు. తెలంగాణ పర్యటన అనంతరం ఒడిశాకు వెళ్లనున్నారు.