Site icon NTV Telugu

PM Modi: బులంద్‌షహర్‌లో ప్రధాని పర్యటన.. పలు అభివృద్ది పనులకు మోడీ శ్రీకారం..

Modi

Modi

ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో పర్యటించనున్నారు. బులంద్‌షహర్‌, మీరట్‌ డివిజన్లకు వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రారంభించబోయే ప్రాజెక్ట్‌లలో కళ్యాణ్ సింగ్ పేరు మీద మెడికల్ కాలేజీ, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని ఒక సెక్షన్ ప్రారంభోత్సవం, అలీఘర్ నుంచి కన్నౌజ్ మధ్య నాలుగు లేన్ల హైవే సహా వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి.

Read Also: Nara Lokesh: రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది: నారా లోకేశ్‌

ఇక, అయోధ్యలో రామ్‌లల్లా దీక్ష తర్వాత ప్రధాని మోడీ ప్రసంగించడం ఇదే తొలిసారి. మాజీ సీఎం, రామాలయం కోసం ఉదయం చేసిన కళ్యాణ్ సింగ్‌ను గుర్తుచేసుకుంటూ ప్రధాని మోడీ భావోద్వేగం చెందే అవకాశం ఉంది. ప్రధాని కర్పూరి ఠాకూర్, చ. చరణ్ సింగ్, కళ్యాణ్ సింగ్‌లను గుర్తు చేసుకోవడం ద్వారాఓబీసీ ఓట్లను కూడా రాబట్టే అవకాశం ఉంది.

Read Also: Crime: ఏఐ సహాయంతో హత్య కేసు ఛేదించిన ఢిల్లీ పోలీసులు

ఇక, ప్రధాని పర్యటనకు ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బులంద్‌షహర్‌కు చేరుకుని పోలీస్ షూటింగ్ రేంజ్ గ్రౌండ్‌లో ఉన్న ప్రధానమంత్రి బహిరంగ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రాజెక్టులను ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బహిరంగ సభ వేదిక దగ్గర జరుగుతున్న ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. బహిరంగ సభలో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ​​అధికారులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు.

Exit mobile version