Site icon NTV Telugu

Narendra Modi : మెగా పవర్ స్టార్ దంపతులకు ప్రధాని మోడీ స్పెషల్ విషెష్..

Charan Modi

Charan Modi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సతీమణి ఉపాసనతో కలిసి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. అనిల్‌ కామినేని సారథ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి  ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా  శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును మోదీకి అందించారు చరణ్ దంపతులు. ఆ సందర్భముగా మోడీని కలిసి విలువిద్య ప్రాముఖ్యతను వివరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. విలువిద్య వారసత్వాన్ని కాపాడుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా దానిని ప్రోత్సహించడానికి మెగా దంపతులు శ్రీకారం చుట్టారు. విలువిద్య  క్రీడలో ఇంకా చాలా మంది చేరాలని చరణ్ – ఉపాసన దంపతులు యువతని ప్రోత్సహించారు.

ఈ నేపథ్యంలో చరణ్ దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ ఎక్స్ ఖాతాలో ‘ రామ్ చరణ్, ఉపాసన,అనిల్ కామినేనిని కలవడం ఆనందంగా ఉంది. విలువిద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న సమష్టి ప్రయత్నాలు ప్రశంసనీయం. మీరు చేస్తున్న ఈ కృషి ఎంతోమంది యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని అభినందిస్తూ ట్వీట్ చేసారు.

Exit mobile version