భారత్ లో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు రాజస్థాన్ లో పర్యటించనున్నారు. ఇక, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎలాంటి అవకాశం వదులుకోవడం లేదు. ఇక, ఓటింగ్ తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ అగ్ర నాయకత్వంతో పాటు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వేగంగా పర్యటనలను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే నేడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో ఎన్నికల పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ బార్మర్‌లోని బైటులో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
ఇక, రాజకీయ నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోధ్‌పూర్‌లోని దాదాపు 33 స్థానాలను బీజేపీ గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూపించి బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే, బార్మర్‌లో అత్యధిక స్థానాల్లో ముక్కోణపు పోటీ నెలకొనడం గమనార్హం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకోగా, బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ అత్యుత్తమ ఫలితాలు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది.