Site icon NTV Telugu

PM Modi: నేడు గుజరాత్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..

Pm Modi

Pm Modi

సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్‌కు ఇంకా వారం రోజులే మిగిలి ఉంది. మే 7వ తేదీన మూడో దశకు ఓటింగ్‌ జరగనుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా, ఇవాళ (బుధవారం) గుజరాత్‌ రాష్ట్రంలోని బనస్కాంత, సబర్‌కాంతలలో నిర్వహించే ర్యాలీలలో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.

Read Also: Faria Abdullah: ప్రభాస్ ఎక్కడికెళ్లినా వాళ్ళు ఉండాల్సిందే.. సీక్రెట్ బయటపెట్టిన చిట్టి!

కాగా, గుజరాత్ రాష్ట్రంలో ప్రధాని మోడీ ప్రచారంతో బీజేపీ ఎన్నికల క్యాంపెన్ కు మరింత ఆదరణ లభిస్తుందని వారు భావిస్తున్నారు. ఇక, గుజరాత్‌లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 26 స్థానాలకు గాను 26 స్థానాలను కైవసం చేసుకుంటుంది. 1998 నుంచి గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ మాత్రమే అధికారంలో ఉంది. అయితే, కేవలం 26 స్థానాల్లో మళ్లీ విజయం సాధించడం బీజేపీ యొక్క లక్ష్యం కాదు.. ఈసారి రాష్ట్రంలో – ప్రతి లోక్ సభ సీటులో సుమారు 5 లక్షల ఓట్ల తేడాతో గెలవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: Ayodhya : నేడు అయోధ్య రాములోరిని దర్శించుకోనున్న రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము

అయితే, మరోవైపు గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ, క్షత్రియుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ ఏడాది మార్చి నెలలో కేంద్రమంత్రి పురుషోత్తమ్ రూపాలా క్షత్రియులపై చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, రూపాల ఇప్పటికే అనేకసార్లు క్షమాపణలు చెప్పినప్పటికీ, క్షత్రియ సంఘాలు అతనిని పార్లమెంట్ అభ్యర్థిగా ఉపసంహరించుకోవాలని కోరాయి. ఎట్టి పరిస్థితుల్లో పురుషోత్తమ్ రూపాలకు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఇవాళ గుజరాత్‌లోని ఆనంద్‌లో బీజేపీకి వ్యతిరేకంగా క్షత్రియ సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిలుపునిచ్చారు.

Exit mobile version