NTV Telugu Site icon

PM MODI: 140 కోట్ల మంది మీ వెంటే.. టీమిండియాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

Modi

Modi

PM MODI: ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెన్ ఇన్ బ్లూ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. తన X ఖాతాలో.. 140 కోట్ల మంది భారతీయులు టీమిండియా కోసం ఉంటారని తెలిపారు. అంతేకాకుండా.. కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడాస్ఫూర్తిని నిలబెడతారని, బాగా ఆడండి అంటూ ట్వీట్ చేశారు.

Read Also: MLC Kavitha: ప్రజలతో అధికార బంధం కాదు.. పేగు బంధం ఉంది..

మరోవైపు ఫైనల్ మ్యాచ్ కోసం స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని మార్లెస్ లు స్టేడియానికి వచ్చారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. ఆరంభంలో మంచిగా రాణించినప్పటికీ ఆ తర్వాత 3 వికెట్లు కోల్పాయాయి. రోహిత్ శర్మ (47), గిల్ (4), శ్రేయాస్ అయ్యర్ (4) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (26), కేఎల్ రాహుల్ (4) ఉన్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది.

Read Also: Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన.. భవన యాజమాని అరెస్ట్

ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ శుభారంభంతో.. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.