NTV Telugu Site icon

PM Modi: జనగామ రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Janagam

Janagam

అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు నేడు( ఆదివారం ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలను కేటాయించిన కేంంద్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.24.50 కోట్లు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధాని మోడీ కార్యాక్రమాన్ని ప్రజలు తిలకించే విధంగా స్టేషన్‌ ఆవరణలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Read Also: Prachi Thaker: కమిట్‌మెంట్ ఇస్తే, రెండు లక్షలిస్తానన్నాడు.. కాస్టింగ్‌ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్

అయితే, దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కాజీపేట జంక్షన్‌, మహబూబాబాద్‌, జనగామ రైల్వేస్టేషన్‌లను ఎంపిక చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లు ఎంపిక అయ్యాయి. కాజీపేట రైల్వేస్టేషన్‌ను రూ.24.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనుండగా, మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ను రూ.39.07 కోట్లతో, జనగామ స్టేషన్‌ను రూ. 24.50 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆధునీకరణ పనులు చేపట్టనుంది. ఆయా స్టేషన్‌లలో జరిగే కార్యక్రమాలకు జిల్లా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురిని రైల్వే అధికారులు ఆహ్వానించారు. అక్కడకు వచ్చిన వారందరు మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు.

Read Also: Mahesh Babu: మహేష్ బాబు దగ్గర ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నాయో తెలుసా?