Prachi Thaker: కమిట్‌మెంట్ ఇస్తే, రెండు లక్షలిస్తానన్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Prachi Thaker Talks About Her Casting Couch Experience: అప్పట్లో ‘మీటూ ఉద్యమం’ చిత్రపరిశ్రమలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు కారణంగా.. నటీమణులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి, ఇండస్ట్రీలోని చీకటి కోణాల్ని బయటపెడుతున్నారు. కెరీర్ ప్రారంభంలో తమకు ఎదురైన చేదు అనుభవాల్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నటి ప్రాచీ ఠాకర్ కూడా తనకెదురైన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది. కమిట్‌మెంట్ ఇస్తే, ఒక వ్యక్తి తనకు రూ.2 లక్షలిస్తానని చెప్పాడని.. తాను ఒప్పుకోకపోవడంతో ఒక ఆఫర్ కోల్పోయానని తన ఆవేదన వ్యక్తం చేసింది.
Mahesh Babu: మహేష్ బాబు దగ్గర ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నాయో తెలుసా?
Also Read
ఓ ఇంటర్వ్యూలో ప్రాచీ ఠాకర్ మాట్లాడుతూ.. ‘‘పటాస్ సినిమా చేసిన తర్వాత ఒక యాడ్ ఏజెన్సీ వాళ్లు నన్ను సంప్రదించారు. ఒక యాడ్ చేయమని వాళ్లు అడిగితే, అందుకు సరేనన్నాను. అయితే.. నాకు తెలుగు భాష సరిగ్గా రాదు కాబట్టి, మీడియేటర్‌గా తెలుగు స్నేహితుడిని నియమించుకున్నాను. ఆ ఏజెన్సీతో మీటింగ్స్ బాగానే జరిగాయి. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నాతో ఈ యాడ్ డీల్ మాట్లాడిన వ్యక్తి, నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. షూటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్తానని అన్నాడు. ‘మరి మీరు కమిట్‌మెంట్ ఇస్తున్నారు కదా’ అని అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. బహుశా యాడ్ షూట్ గురించి అంటున్నాడేమోనని అనుకొని, ఎప్పుడు షూట్ ఉంటే ఆరోజే కమిట్‌మెంట్ ఇస్తానని సమాధానం ఇచ్చాను’’.
Ileana : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన గోవా బ్యూటీ..
‘‘అది కాదు, కమిట్‌మెంట్‌కు నువ్వు రెడీనే కదా? అని మరోసారి అడిగాడు. నువ్వు డేట్ చెప్పు, కచ్చితంగా ఆరోజు షూట్‌కి వచ్చేస్తానని మళ్లీ సమాధానం ఇచ్చాను. అప్పుడతను.. ‘మేటర్ అది కాదు, నాకో పార్ట్‌నర్ ఉన్నాడు, అతనితో కాంప్రమైజ్ అవుతావా, నీకు రెండు లక్షలిస్తా’ అని చెప్పాడు. నాకు సరిగ్గా అర్థం కాకపోవడంతో, ఆ సంభాషణను స్క్రీన్‌షాట్ తీసి నా ఫ్రెండ్‌కు పంపించాను. అప్పుడామె నాకు వివరంగా చెప్పింది. అసలు విషయం అర్థం కావడంతో చాలా బాధేసింది. మరో దారి లేక ఆ యాడ్ కూడా చేయనని తెగేసి చెప్పా’’ అంటూ ప్రాచీ ఠాకర్ చెప్పుకొచ్చింది. కాగా.. రాజుగారి కోడి పులావ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రాచీ.. పటాస్ సినిమాతో మంచి పేరు సంపాదించింది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!