NTV Telugu Site icon

PM Modi: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురవేయనున్న ప్రధాని మోడీ

Modi 2

Modi 2

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. వరుసగా 10వ సారి ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగువేయనున్నారు. రేపు ఉదయం 7.06 నిమిషాలకు రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ప్రధాని నివాళి అర్పించనున్నారు. అనంతరం 7.18కి ఎర్రకోటకు చేరుకోనున్నారు. ఆ తర్వాత 7.30కు జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరణ చేయనున్నారు. ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేసిన వెంటనే భారత వైమానిక దళానికి చెందిన మార్క్-III ధ్రువ్ అనే రెండు హెలికాప్టర్లు పూల వర్షం కురిపిస్తాయి. అనంతరం 7.33 నిమిషాలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

Suriya: కుటుంబంతో విడిపోయి ముంబైలో మకాం.. సూర్య ఏమన్నాడంటే.. ?

మరోవైపు ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 30 వేల నుంచి 40 వేల వరకు మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,800 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించారు. వీరిలో సర్పంచులు, రైతులు, పార్లమెంట్ నిర్మాణ కార్మికులు, రోడ్ల నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు, హర్ ఘర్ జల్ కార్మికులు, ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు ఉన్నారు. ఆహ్వానితుల్లో హై-సెక్యూరిటీ జోన్‌లో 268 మంది వీఐపీలకు చోటు కల్పించారు. ఇప్పటికే ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట చుట్టూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Vaishnavi Chaithanya: ‘బేబీ’ బ్యూటీ.. అన్ని ఆ డైరెక్టర్ తోనే.. ?

మరోవైపు జ్ఞాన్‌పథ్‌లో 1,000 మందికి, మాధవ్‌దాస్ పార్క్‌లో 4,766 మందికి, ఆగస్ట్ 15 పార్క్‌లో 20,450 మందికి సీటింగ్ ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా 10 వేల మంది భద్రతా సిబ్బందితో నాలుగు అంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతకోసం 1,000 సెక్యూరిటీ కెమెరాలు, 16 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు నుంచి నాలుగు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రత కోసం ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలు కూడా పాల్గొననున్నాయి. మరోవైపు సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు.