NTV Telugu Site icon

Narendra Modi: కేరళలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన

Modi

Modi

ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు కేరళ పర్యటనకు వెళ్తున్నారు. ఈ రోజు తొలుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీని ప్రారంభించనున్నారు. 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని ఆయన సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొచ్చికి చేరుకోనున్నారు. ఇక, పోర్ట్ సిటీలో ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించనున్నారు.

Read Also: Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

ఇక, రేపు ప్రధాని మోడీ త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్‌లో నటుడు కమ్ పొలిటీషియన్ సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం ప్రధానమంత్రి కొచ్చికి తిరిగి వస్తారు.. అక్కడ రెండు-మూడు బూత్-స్థాయి నేతలతో ‘శక్తి కేంద్రాల్లో’ దాదాపు 6,000 మంది ఇన్‌ఛార్జ్‌లు పార్టీ సమావేశానికి హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మోడీ పాల్గొనున్నారు. ఇక, ఈ సమావేశం తర్వాత సాయంత్రానికి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.