NTV Telugu Site icon

Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. !

Modi

Modi

ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారు అయింది. ఈనెల 25వ తేదీన కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇక, 26వ తేదీన తుఫ్రాన్, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అలాగే, 27వ తేదీన మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో రోడ్డు షోలో మాట్లాడనున్నారు. అయితే, అయితే, ఈ నెల ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుని.. అక్కడి నుంచి 2:05 గంటలకు కామారెడ్డిని బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు సభలో పాల్గొంటారు.. ఆ సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:05 గంటలకు రంగారెడ్డి జిల్లాకు చేరుకుంటారు.. సాయంత్రం 4:15 నుంచి 4:55 గంటల వరకు నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి బయలుదేరి 7:35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజ్ భవన్ కు చేరుకుంటారు.. రాత్రికి రాజ్ భవన్ లో ప్రధాని మోడీ బస చేయనున్నారు.

Read Also: Catherine Tresa Alexander : అందాలతో కుర్రాళ్ల మదిని కొల్లగొడుతున్న కేథరీన్ ట్రెసా

ఇక, 26వ తేదీన దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు వెళ్తారు.. 2:15 గంటల నుంచి 2:45 వరకు తుఫ్రాన్ లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో మోడీ ఉంటారు.. ఆ సభ అనంతరం నిర్మల్ కు వెళ్లనున్నారు.. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:25 వరకు బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు.. అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి బయలుదేరనున్నారు.

Read Also: Harish Rao: నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడింది: హరీశ్‌ రావు

అలాగే, 27వ తేదీన మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో నిర్వహించే రోడ్డు షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. 27వ తేదీన తిరుపతి నుంచి బయలుదేరి 11:30 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 నుంచి 1:25 వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.. ఆ సభ అనంతరం నేరుగా కరీంనగర్ బయలుదేరి వెళ్లనున్నారు.. 2:45 గంటల నుంచి 3:25 వరకు కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.. ఇక, అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40కి హైదరాబాద్ కు చేరుకుంటారు.. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోడీ పాల్గొననున్నారు. విమానాశ్రయం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది.. రోడ్ షో అనంతరం నేరుగా హైదరాబాద్ నుంచి 6:25 గంటలకు ఢిల్లీకి ప్రధాని మోడీ తిరుగు పయనం కానున్నారు.

Show comments