ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీలో ఒక సభలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి అస్వస్థతకు గురై.. అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి సహాయం చేయమని వైద్య బృందాన్ని కోరారు. తాను ప్రసంగిస్తుండగా.. ఆ వ్యక్తి అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించానని.. ఆ వ్యక్తికి అవసరమైన వైద్య సహాయం అందించమని ప్రధాని తన బృందానికి తెలిపాడు. ఈ విషయాన్ని వార్తా సంస్థ ANI.. X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్రధాని మోడీ ఏమన్నారంటే.. “అతని చేతులు పట్టుకుని అతనికి సహాయం చేయండి. అతని బూట్లు తీయండి. అని తెలిపారు.
Read Also: Gannavaram Politics: నో డౌట్..! ఆయన సహకరిస్తారు.. గన్నవరంలో గెలుపు వైసీపీదే..
దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనల అనంతరం బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకున్న మోడీ.. ఓ సభలో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగినప్పుడు కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపేసిన ప్రధాని.. అనంతరం పునఃప్రారంభించారు. అంతకుముందు గ్రీస్ పర్యటన నుంచి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.
Read Also: Nuh Voilence: నుహ్‌లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. 144 సెక్షన్ విధింపు..!
అంతకుముందు.. చంద్రయాన్-3 విజయవంతం కావడంపై బ్రిక్స్ సదస్సు సందర్భంగా తనకు చాలా అభినందన సందేశాలు వచ్చాయని ప్రధాని తెలిపారు. చంద్రుడిపై ‘విక్రం’ ల్యాండ్ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని పేరు పెట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు.